Breaking News

లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం

లింగంపల్లి (Lingampally) రైల్వే స్టేషన్ సమీపంలో నేడు (డిసెంబర్ 18, 2025) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.


Published on: 18 Dec 2025 16:09  IST

లింగంపల్లి (Lingampally) రైల్వే స్టేషన్ సమీపంలో నేడు (డిసెంబర్ 18, 2025) భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న 52 అంతస్తుల భారీ భవన నిర్మాణ స్థలంలో (construction site) ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వరుసగా సుమారు ఆరు సిలిండర్లు పేలినట్లు సమాచారం.మంటలు భారీగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు మరియు రైల్వే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు నివేదికలు అందలేదు, అయితే ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి