Breaking News

నరసింహావతారంలో భద్రద్రి రామయ్య

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా, 2025 డిసెంబర్ 23 (మంగళవారం) నాడు భద్రాద్రి రామయ్య నరసింహావతారంలో భక్తులకు దర్శనమిస్తారు.


Published on: 23 Dec 2025 11:58  IST

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా, 2025 డిసెంబర్ 23 (మంగళవారం) ఈ రోజు భద్రాద్రి రామయ్య నరసింహావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు 2025 డిసెంబర్ 20 నుండి ప్రారంభమై 2026 జనవరి 09 వరకు కొనసాగుతాయి.ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రస్వామిని నరసింహుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

భూత గ్రహ బాధలు లేదా కుజ గ్రహ దోషాలు ఉన్నవారు ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే ఆ బాధల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.ఉత్సవ మూర్తులను నరసింహ అవతారంలో అలంకరించి ప్రాకార మండపానికి తీసుకువస్తారు. అక్కడ వేద పండితులు నాళాయర దివ్యప్రబంధం, వేద పారాయణలు మరియు క్షేత్రమహత్య పారాయణాలు చేస్తారు. 

Follow us on , &

ఇవీ చదవండి