Breaking News

పిల్లల కళ్లముందే పెట్రోల్ పోసి భార్య హత్య

హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 డిసెంబర్ 24 అర్థరాత్రి ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో వెంకటేష్ అనే వ్యక్తి తన భార్య త్రివేణిని పిల్లల కళ్లముందే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు.


Published on: 26 Dec 2025 11:57  IST

హైదరాబాద్‌లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 డిసెంబర్ 24 అర్థరాత్రి ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో వెంకటేష్ అనే వ్యక్తి తన భార్య త్రివేణిని పిల్లల కళ్లముందే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.భార్యపై అనుమానంతో వెంకటేష్ తరచూ వేధించేవాడు. వేధింపులు భరించలేక త్రివేణి పుట్టింటికి వెళ్ళిపోగా, తాను మారతానని నమ్మబలికి వెంకటేష్ ఆమెను తిరిగి నల్లకుంటకు తీసుకొచ్చాడు.

డిసెంబర్ 24 (బుధవారం) అర్ధరాత్రి ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. ఆగ్రహంతో వెంకటేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెను అడ్డుకోబోయిన కూతురిని కూడా మంటల్లోకి నెట్టేయడంతో ఆ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.స్థానికులు త్రివేణిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నల్లకుంట పోలీసులు నిందితుడు వెంకటేష్‌ను అరెస్ట్ చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 (1) కింద కేసు నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి