Breaking News

IPS అధికారి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది

జనవరి 9, 2026 శుక్రవారం నాడు సిద్దిపేట మాజీ పోలీస్ కమిషనర్, IPS అధికారి ఎస్.ఎం. విజయ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.


Published on: 09 Jan 2026 17:53  IST

జనవరి 9, 2026 శుక్రవారం నాడు సిద్దిపేట మాజీ పోలీస్ కమిషనర్, IPS అధికారి ఎస్.ఎం. విజయ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.రాజీవ్ రహదారిపై రిమ్మనగూడ సమీపంలో రోడ్డు దాటుతున్న మేకలను తప్పించబోయి డ్రైవర్ కారును పక్కకు మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగింది.కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న పైప్‌లైన్ చాంబర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ కుమార్ క్షేమంగా బయటపడగా, అక్కడ మేకలను మేపుతున్న ఒక బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ కుమార్ కారు దిగి, గాయపడిన బాలుడిని పరామర్శించారు. బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.ఇటీవలే జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా సిద్దిపేట సీపీగా ఉన్న విజయ్ కుమార్ హైదరాబాద్‌లోని స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Follow us on , &

ఇవీ చదవండి