Breaking News

ప్రియుడి కోసం తల్లిదండ్రులకు విషం

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ప్రియుడి కోసం తల్లిదండ్రులను కడతేర్చిన కూతురి ఉదంతం కలకలం రేపింది.


Published on: 28 Jan 2026 16:11  IST

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ప్రియుడి కోసం తల్లిదండ్రులను కడతేర్చిన కూతురి ఉదంతం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన దశరథ్, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి రెండో కుమార్తె సురేఖ, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.సురేఖ ఒక యువకుడిని ప్రేమించింది. అయితే ఆమె ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించడంతో, వారిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది.

నర్సుగా పనిచేస్తున్న సురేఖ, జనవరి 27 రాత్రి తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి, ఆపై విష ప్రయోగం చేసి చంపేసింది.

తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, వారు అపస్మారక స్థితిలో ఉన్నారని తన సోదరుడికి ఫోన్ చేసి నాటకమాడింది. అయితే అనుమానం వచ్చిన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు సురేఖను విచారించగా, ప్రియుడి కోసం తల్లిదండ్రులను తానే చంపినట్లు అంగీకరించింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి