Breaking News

కరీంనగర్ మేయర్ పీఠం బిజేపీ కైవసం

2026 ఫిబ్రవరి 16న జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) కైవసం చేసుకుంది. బీజేపీకి చెందిన కొలగాని శ్రీనివాస్ (2వ డివిజన్ కార్పొరేటర్) మేయర్‌గా ఎన్నికయ్యారు.డిప్యూటీ మేయర్గా బీజేపీకి చెందిన వై. సునీల్ రావు ఎన్నికయ్యారు.

Published on: 17 Feb 2026 10:54  IST

2026 ఫిబ్రవరి 16న జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) కైవసం చేసుకుంది. బీజేపీకి చెందిన కొలగాని శ్రీనివాస్ (2వ డివిజన్ కార్పొరేటర్) మేయర్‌గా ఎన్నికయ్యారు.డిప్యూటీ మేయర్గా బీజేపీకి చెందిన వై. సునీల్ రావు ఎన్నికయ్యారు.

కొలగాని శ్రీనివాస్‌కు 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల నర్మదకు 21 ఓట్లు వచ్చాయి.మొత్తం 66 డివిజన్లలో బీజేపీ 30 స్థానాలను గెలవగా, ముగ్గురు స్వతంత్రులు మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి బీజేపీ బలం 34కు చేరింది.బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో (abstain) బీజేపీ విజయం సులువైంది. కరీంనగర్ మున్సిపల్ చరిత్రలో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఈ విజయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యూహకర్తగా వ్యవహరించారు. 

Follow us on , &

ఇవీ చదవండి