Breaking News

వడ్లలోడు లారీని ఢీకొన్నRTC సూపర్లగ్జరీ బస్సు

మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో 2026 ఏప్రిల్ 28, మంగళవారం మధ్యాహ్నం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. 


Published on: 28 Apr 2026 18:59  IST

మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో 2026 ఏప్రిల్ 28, మంగళవారం మధ్యాహ్నం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న RTC సూపర్ లగ్జరీ బస్సు, కొల్చారంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో ముందు వెళ్తున్న వడ్ల లోడు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బస్సులో కండక్టర్ లేకపోవడంతో డ్రైవరే టికెట్లు ఇస్తూ, అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మరియు బాధితులు పేర్కొంటున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, 108 వాహనాల ద్వారా క్షతగాత్రులను మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి