Breaking News

నాగర్‌కర్నూల్లో అగ్నిప్రమాదం 5 దుకాణాలు దగ్ధం

నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలోని ప్రసిద్ధ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం ముందున్న ఐదు దుకాణాలు మే 20, 2026 బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిబూడిదయ్యాయి.


Published on: 21 May 2026 17:31  IST

నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలోని ప్రసిద్ధ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం ముందున్న ఐదు దుకాణాలు మే 20, 2026 బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

బుధవారం అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి మొదట ఎండి గౌస్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.ఆ మంటలు వేగంగా పక్కనే వరుసగా ఉన్న నేనావత్ బోడి, శ్రీను, వెంకటేష్, మరియు మల్లేష్ గౌడ్‌లకు చెందిన దుకాణాలకు విస్తరించి, ఐదు షాపులు పూర్తిగా కాలిపోయాయి.ఈ ప్రమాదం వల్ల ఒక్కో దుకాణదారునికి సుమారు రూ. 8 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దుకాణమే జీవనాధారంగా బతుకుతున్న బాధితుల్లో శ్రీను అనే వ్యక్తి కుటుంబం కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు.

మంటలను గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై, వాటిని అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ఒకవేళ స్థానికులు సకాలంలో స్పందించకపోతే ఆలయ పరిసరాల్లో ఉన్న మరిన్ని దుకాణాలకు మంటలు వ్యాపించి ఇంకా భారీ నష్టం జరిగి ఉండేదని గ్రామస్తులు తెలిపారు. సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా తక్షణమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి