Breaking News

ఆదిలాబాద్లో అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడి అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భారీ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ఒక అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు.సెప్టెంబర్ 2, 2026 న జరిగిన ఒక మీడియా సమావేశంలో, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.


Published on: 02 Sep 2026 17:17  IST

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భారీ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన ఒక అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు.సెప్టెంబర్ 2, 2026 న జరిగిన ఒక మీడియా సమావేశంలో, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

నేరం జరిగిన తీరు ,దర్యాప్తు వివరాలు:

నిందితుడి వివరాలు: నిందితుడిని రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాకు చెందిన ప్రకాష్ కుమార్‌గా గుర్తించారు. ఇతడు మొబైల్ ఫోన్ విడిభాగాల (స్పేర్ పార్ట్స్) వ్యాపారి.

మోసం చేసిన విధానం: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నకిలీ పేజీని సృష్టించి, తక్కువ ధరలకే మొబైల్ డిస్‌ప్లేలు, ఛార్జర్లు, ఇతర యాక్సెసరీలను విక్రయిస్తామని వ్యాపారులను, ప్రజలను నమ్మించేవాడు. ఫేక్ కొరియర్ సర్వీసుల ద్వారా పార్సిల్స్ పంపుతున్నట్లు నమ్మించి, బాధితుల నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసేవాడు.

బాధితుల సంఖ్య , సొమ్ము: ఈ కేడీ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ తదితర ప్రాంతాలలో) సుమారు 140 మందిని మోసం చేసి ₹5.30 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.

కేసు నమోదు: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన సమీర్ సయ్యద్ అనే మొబైల్ వ్యాపారి స్పేర్ పార్ట్స్ కోసం ₹18,000 చెల్లించి మోసపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాల సహాయంతో సైబర్ క్రైమ్ విభాగం నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసింది.

స్వాధీనం చేసుకున్నవి: నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్ మరియు ₹1 లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలకు పోలీసుల సూచనలు:

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ ధరలకే వస్తువులు లభిస్తున్నాయని వచ్చే ప్రకటనలను నమ్మి తెలియని వ్యక్తులకు ముందస్తు చెల్లింపులు చేయవద్దని ఎస్పీ సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి