Breaking News

చింతకాని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

ఖమ్మం జిల్లా చింతకాని తహసీల్దార్ కార్యాలయం ఎదుట 13 మే 2026 (బుధవారం) నాడు మొక్కజొన్న రైతులు భారీ ఆందోళన చేపట్టారు.


Published on: 13 May 2026 16:44  IST

ఖమ్మం జిల్లా చింతకాని తహసీల్దార్ కార్యాలయం ఎదుట 13 మే 2026 (బుధవారం) నాడు మొక్కజొన్న రైతులు భారీ ఆందోళన చేపట్టారు. లారీల సరఫరా నిలిచిపోవడం, ట్రక్ షీట్ల జారీలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఈ ధర్నాకు దిగారు.

ఈ నెల 2వ తేదీన నాగులవంచ సహకార సంఘం నుండి మొక్కజొన్న లోడుతో వెళ్లిన లారీలను, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గోదాముల్లో ఇప్పటివరకు అన్‌లోడ్ చేయలేదు.లారీలు గత 12 రోజులుగా గోదాం వద్దే నిలిచిపోవడంతో, లారీ యజమానులు మరియు డ్రైవర్లు తమకు వెయిటింగ్ ఛార్జీలు (డీమరేజ్) చెల్లించాలని రైతులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.పంట అన్‌లోడ్ చేయడంలో అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి మొక్కజొన్న దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళన తీవ్రమవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో చింతకాని సహకార సంఘం సీఈవో శ్రీనివాసరావు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. అక్కడున్న సిబ్బంది వెంటనే ఆయనను చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించి చికిత్స అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి