Breaking News

గొడవ ఆపేప్రయతంలో యువకుడు మృతి

హైదరాబాద్‌లోని టోలిచౌకిలో జరిగిన గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన నేడు (డిసెంబర్ 15, 2025) ఆదివారం రాత్రి పారామౌంట్ కాలనీ గేట్ నంబర్-4 సమీపంలో చోటుచేసుకుంది. 

Published on: 15 Dec 2025 11:27  IST

హైదరాబాద్‌లోని టోలిచౌకిలో జరిగిన గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన నేడు (డిసెంబర్ 15, 2025) ఆదివారం రాత్రి పారామౌంట్ కాలనీ గేట్ నంబర్-4 సమీపంలో చోటుచేసుకుంది. 

ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న గొడవను చూసి, బాధితుడైన యువకుడు జోక్యం చేసుకుని వారిని శాంతపరచడానికి ప్రయత్నించాడు.ఈ క్రమంలో, ఆగ్రహించిన నిందితుడు యువకుడిపై కత్తితో దాడి చేశాడు.తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి