Breaking News

ఎంపీ ఎలక్షన్స్ ముందే తెలంగాణలో ఉపఎన్నిక.. షెడ్యూల్ విడుదల!!

తెలంగాణలో ఉపఎన్నికల సందడి మొదలైంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం తెలంగాణలో ఊపందుకుంది. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నిక కోసం సీఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 4 నోటిఫికేషన్ విడుదలవగా.. మార్చి 28న పోలింగ్ జరగనుంది.


Published on: 27 Feb 2024 14:15  IST

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయ హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఎంపీ ఎలక్షన్స్ కంటే మందుగానే తెలంగాణ ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక నిర్వహణ కోసం మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక అదే రోజున నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. నామినేషన్లను దాఖలుకు మార్చి 11 చివరి తేదీ కాగా.. మరుసటి రోజున పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్లు ఉపసంహరించుకోడానికి మార్చి 14 చివరి తేదీ. పోలింగ్ మార్చి 28న జరగనుంది. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి