Breaking News

చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద నిల్చిన వాహనాలు

నేడు ఏప్రిల్ 10, 2026 నుండి జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అలగడప - చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 

Published on: 10 Apr 2026 15:44  IST

నేడు ఏప్రిల్ 10, 2026 నుండి జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అలగడప - చిల్లేపల్లి టోల్ గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 

నగదు రహిత విధానం (No Cash Rule) నేటి నుండే అమలులోకి రావడంతో, ఫాస్టాగ్ (FASTag) లేని లేదా తగినంత బ్యాలెన్స్ లేని వాహనదారులు నగదు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు నగదును నిరాకరిస్తుండటంతో టోల్ ప్లాజా వద్ద వందలాది వాహనాలు నిలిచిపోయాయి.నేటి నుండి టోల్ ప్లాజాల వద్ద కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఫాస్టాగ్ లేకపోతే, వాహనదారులు సాధారణ టోల్ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా యూపీఐ ద్వారా చెల్లించాల్సి వస్తోంది.యూపీఐ ద్వారా కూడా చెల్లించని వాహనదారులకు ఈ-నోటీసులు జారీ చేస్తున్నారు లేదా వారిని టోల్ ప్లాజా దాటకుండా నిలిపివేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి