Breaking News

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

మార్చి 27, 2026 న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. 


Published on: 27 Mar 2026 17:20  IST

మార్చి 27, 2026 న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వేడుకలు మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. 

భద్రాద్రి క్షేత్రంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేడుకను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

కళ్యాణానికి ముందు స్వామివారికి వరపూజ, పాదప్రక్షాళన వంటి విశేష క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలు 'రామ నామ' స్మరణతో మారుమోగాయి.సంప్రదాయం ప్రకారం మార్చి 28న భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించబడుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి