Breaking News

పొగమంచు వల్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో జనవరి 2, 2026 (శుక్రవారం) అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 


Published on: 03 Jan 2026 11:29  IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో జనవరి 2, 2026 (శుక్రవారం) అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకన్‌పల్లి గేటు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.రోడ్డుపైకి ఒక్కసారిగా అడవి పంది అడ్డురావడంతో, దానిని తప్పించబోయి కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. దట్టమైన పొగమంచు వల్ల దారి సరిగా కనిపించకపోవడం కూడా ప్రమాదానికి ఒక కారణంగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో పోరండ్ల గ్రామానికి చెందిన తేరటి శ్రీకాంత్ (27)సంగెం గిరిబాబు అలియాస్ గిరీష్ (34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో స్నేహితుడు దయ్యాల శివ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నూతన సంవత్సరం సందర్భంగా వీరు ముగ్గురు మహేశ్వరంలో బిర్యానీ తిని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి