Breaking News

సౌదీలో 42 మంది భారతీయలు మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దుర్ఘటన ఈరోజు, నవంబర్ 17, 2025 తెల్లవారుజామున మక్కా నుండి మదీనాకు వెళ్లే మార్గంలో జరిగింది. 


Published on: 17 Nov 2025 10:20  IST

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దుర్ఘటన ఈరోజు, నవంబర్ 17, 2025 తెల్లవారుజామున మక్కా నుండి మదీనాకు వెళ్లే మార్గంలో జరిగింది. 

ఉమ్రా యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.ఢీకొన్న వెంటనే బస్సుకు మంటలు వ్యాపించడంతో 42 మంది సజీవ దహనమయ్యారు.మృతుల్లో ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో సుమారు 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారని ప్రాథమిక సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే సౌదీ అధికారులు, భారత రాయబార కార్యాలయం స్పందించాయి. తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది.బాధిత కుటుంబాలకు సహాయం అందించడానికి, సమాచారం తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ నంబర్లు: +91 79979 59754+91 99129 19545. ఈ విషాదకర ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు మృతుల సంఖ్యను ధృవీకరించే పనిలో ఉన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి