Breaking News

కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌పై హత్యాయత్నం

కరీంనగర్‌లో 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించి, ఈ రోజు (25 జూన్ 2026) ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.


Published on: 25 Jun 2026 16:33  IST

కరీంనగర్‌లో 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించి, ఈ రోజు (25 జూన్ 2026) ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తొలుత సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణ మరియు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పథకం ప్రకారం జరిగిన హత్యాయత్నంగా వెలుగుచూసింది.

అరెస్ట్ అయిన నిందితులు సుంచు కిషోర్‌, సుద్దాల ప్రణయ్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, మరొకరు జానీ.జూన్ 17వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో జరిగింది.కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్‌ నగర్‌, రామనయ్య టిఫిన్ సెంటర్ సమీపంలో.

కార్పొరేటర్ వేణుప్రసాద్ బైక్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో నిందితులు తమ తెల్లటి కారుతో ఆయనను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనను ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా మార్చేందుకు నిందితులు ప్రయత్నించారు.కేసు నమోదు చేసిన కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా, సదరు కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి.

నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, పాత కక్షల మనసులో పెట్టుకునే పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి చంపాలని ప్లాన్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి