Breaking News

అప్పు వసూలు విషయమై ఘర్షణ వృద్ధుడు మృతి

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో  బుధవారం (11 మార్చి 2026) అప్పు వసూలు విషయమై జరిగిన ఘర్షణలో ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

Published on: 11 Mar 2026 14:50  IST

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో  బుధవారం (11 మార్చి 2026) అప్పు వసూలు విషయమై జరిగిన ఘర్షణలో ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 

శంభులింగం (60). అప్పు విషయమై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన, నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.పదిర గ్రామానికి చెందిన సూర ఆంజనేయులు, శంభులింగం మధ్య గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నడుస్తోంది.గతంలోనే పెద్దల సమక్షంలో రూ.80 వేల అప్పు చెల్లించినప్పటికీ, సూర ఆంజనేయులు అధిక వడ్డీ ఆశించి ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బుధవారం ఉదయం ఆంజనేయులు శంభులింగం ఇంటికి వచ్చి గొడవకు దిగి, ఆయన ఛాతిపై బలంగా దాడి చేశాడు. దీంతో శంభులింగం అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి