Breaking News

మేడారం జాతరకు అంకురార్పణ

మేడారం మహాజాతరకు రెండు వారాల ముందు అంకురార్పరణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జాతర ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు జరగనున్నది.


Published on: 08 Feb 2024 10:52  IST


మేడారం జాతరకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే మేడారంలో భక్తజనం పోటెత్తుతోంది. మేడారం జాతరకు రెండు వారాల ముందే ఆదివాసీల ఆచార సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గుడిమెలిగె పండుగలో భాగంగా పూజారులు మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను శుద్ధి చేస్తారు. ఆ తరువాత మేడారం జాతరను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం అనంతరం మేల తాళాలతో వెళ్లి మేడారంలోని సమ్మక్క దేవాయాన్ని శుద్ది చేస్తారు.  ఆలయం లోపల అలికి సమ్మక్క ప్రతిరూపానికి ప్రత్యేక పూజలు చేస్తారు. అదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ దేవాలయంలో కూడా శుద్ది చేసిఆదివాసీ ఆచార సాంప్రాయాల ప్రకారం పూజలు చేస్తారు. 
మేడారంలో గుడిమెలిగే సమయంలో ఏటూరునాగారం మండలం కొండాయిలోని గోవిందరాజు, గంగారం మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలకు ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం శుద్ది చేసిన పూజారులు పూజలు చేస్తారు. దీనితో మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఇక్కడి నుంచే ప్రారంభమవుతంది. జాతర ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు జరగనున్నది.

Follow us on , &

ఇవీ చదవండి