Breaking News

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సరికొత్త ఆలోచన

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి బీజేపీ MLA కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సరికొత్త ఆలోచన అమల్లోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఒకే ఒక్కడు సినిమా తరహాలో నియోజకవర్గం మొత్తం కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామాన్ వద్ద కంప్లైంట్ బాక్స్‌ను వెంకట రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు.


Published on: 12 Feb 2024 12:02  IST

కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే  వెంకట రమణా రెడ్డి  తెలిపారు. ఫిర్యాదులను గ్రామానికి వచ్చి నేరుగా తానే పరిష్కరిస్తానని చెప్పారు.  ప్రజలు తమ సమస్యలను కంప్లైంట్ బాక్స్‌ల ద్వారా తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సూచించారు. 
టీవల కామారెడ్డి నియోజకవర్గంలో రహదారి విస్తరణ జరుగుతున్న విషయం తెలిసిందే, ఆ విస్తరణ పనుల్లో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తన సొంతింటినే ముందుగా కూల్చేయించారు. బహిరంగ మార్కెట్​లో దీని విలువ సుమారు రూ.6 కోట్లుగా ఉంటుందని స్వయంగా ఆయనే  ప్రకటించారు. ఎందుకంటే కామారెడ్డి పట్టణ పాత మాస్టర్​ప్లాన్‌​లో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్​నుంచి పంచముఖ హనుమాన్​ఆలయం మీదగా రైల్వేగేట్​ వరకు ఉన్న రోడ్డును 80 అడుగుల రహదారిగా నిర్ణయించారు. 
ఈ రోడ్డు విస్తరణ భాగంగా తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని పడగొట్టాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు ఏ మాత్రం చింతించకుండా, ఎమ్మెల్యేననే అహంకారం చూపకుండా స్థానికులు, పురపాలక, రోడ్డు భవనాల శాఖ అధికారుల సమక్షంలో ప్రొక్లెయిన్లలతో కూల్చివేయించి అందరి హృదయాలను గెలుచుకున్నారు. అలాగే రహదారుల విస్తరణ కోసం ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి