Breaking News

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు విచారణకు మంచు లక్ష్మి

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులో నటి మంచు లక్ష్మి 2025, డిసెంబర్ 23 (మంగళవారం) నాడు హైదరాబాద్‌లోని సీఐడీ (CID) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. 

Published on: 23 Dec 2025 14:44  IST

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులో నటి మంచు లక్ష్మి 2025, డిసెంబర్ 23 (మంగళవారం) నాడు హైదరాబాద్‌లోని సీఐడీ (CID) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. 

యోలో 247’ (YOLO 247) అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు గాను సీఐడీ ఆమెను ప్రశ్నించింది.ఈ యాప్ ప్రచారానికి సంబంధించి ఆమెకు అందిన పారితోషికం, కుదుర్చుకున్న ఒప్పందాల గురించి అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.ఇదే ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మనీ లాండరింగ్ కోణంలో మంచు లక్ష్మి ఇప్పటికే 2025, ఆగస్టు 13 ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు కూడా హాజరయ్యారు.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR) ఆధారంగా సీఐడీ ఈ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి వంటి ఇతర సినీ ప్రముఖులను కూడా అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. 

Follow us on , &

ఇవీ చదవండి