Breaking News

జూన్‌ 9న తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌

తెలంగాణలో గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 9వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఇటీవలే 563 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.


Published on: 27 Feb 2024 12:43  IST

ఫిబ్రవరి 23న మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 14 వరకు కొనసాగనుంది. గతంలో గ్రూప్-1 కు దరఖాస్తు చేసుకున్న వారు మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు అవకాశం ఇచ్చింది. కాగా, సెప్టెంబర్/అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు దొర్లిన పొరపాట్లు సవరించుకునేందుకు మార్చి 23వ తేదీనుంచి 27వ తేదీ సాయంత్రం 5 వరకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 9వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషన్‌ తాజాగా ప్రకటించింది.  పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే 4 గంటల ముందు వరకు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 

Follow us on , &

ఇవీ చదవండి