Breaking News

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు

ఫిబ్రవరి 13, 2026న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published on: 13 Feb 2026 17:10  IST

ఫిబ్రవరి 13, 2026న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీఆర్‌ఎస్ 12 స్థానాల్లో, కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో గెలుపొందారు.మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 14 (ఎక్స్-అఫీషియో ఓట్లతో కలిపి) కావాల్సి ఉండటంతో, గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.గెలిచిన అభ్యర్థులు వెన్నుపోటు పొడుస్తారనే భయం, ఓటమి పాలైన అభ్యర్థుల అసంతృప్తితో పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 

Follow us on , &

ఇవీ చదవండి