Breaking News

మక్తల్ మున్సిపాలిటీ బిజేపీ ఆభ్యర్ధి ఆత్మహత్య

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందే విషాదం చోటుచేసుకుంది


Published on: 10 Feb 2026 10:13  IST

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందే విషాదం చోటుచేసుకుంది.మక్తల్ మున్సిపాలిటీ 6 వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న ఎరుకలి మహాదేవ్ (48) మంగళవారం (10 ఫిబ్రవరి 2026) తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఎన్నికల ఖర్చులు మరియు ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.సోషల్ మీడియాలో ప్రత్యర్థులు చేస్తున్న వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య సత్తెమ్మ ఆరోపించారు.డబ్బు, మద్యం పంపిణీ కోసం పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి రావడంతో, తన వల్ల అంత ఖర్చు కాదని ఆయన ఆవేదన చెందినట్లు తెలుస్తోంది.ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మరణించడంతో, 6వ వార్డులో ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. 

 

Follow us on , &

ఇవీ చదవండి