Breaking News

గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం అర్ధరాత్రి (జూన్ 4, జూన్ 5, 2026 తెల్లవారుజామున) ఒకే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు.


Published on: 05 Jun 2026 14:52  IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం అర్ధరాత్రి (జూన్ 4, జూన్ 5, 2026 తెల్లవారుజామున) ఒకే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం స్థానిక కలాల్‌వాడ కాలనీలో చోటుచేసుకుంది.

వనం చంద్రకళ (45) (అమ్మమ్మ), ఆమె మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14) గా గుర్తించారు.అర్ధరాత్రి వీరంతా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లంతా మంటలు వ్యాపించాయి.మంటల వేడికి ఇంట్లోని వంటగ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో, రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమై ముగ్గురూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

మృతురాలు చంద్రకళ భర్త సైదులు అనారోగ్యం కారణంగా సరిగ్గా నెల రోజుల క్రితమే మరణించారు.చంద్రకళ పెద్ద కుమార్తె ధనమ్మ భర్త పదేళ్ల క్రితమే చనిపోవడంతో, ఆమె తన ఇద్దరు పిల్లలతో (లక్ష్మణ్, ప్రణతి) కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.కుటుంబ పోషణ నిమిత్తం ధనమ్మ కేవలం మూడు రోజుల క్రితమే పిల్లలను అమ్మమ్మ వద్ద ఉంచి, ఇళ్లలో పనుల కోసం పూణె నగరానికి వెళ్లింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో కలాల్‌వాడ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement