Breaking News

నల్లగొండలోని (Nalgonda) ఓ బిర్యాని సెంటర్‌లో పేలుడు కలకలం సృష్టించింది.

నల్లగొండలోని (Nalgonda) ఓ బిర్యాని సెంటర్‌లో పేలుడు కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజాము హైదరాబాద్ రోడ్డులోని పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న హాట్ బకెట్ బిర్యాని సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది.


Published on: 25 Mar 2025 13:14  IST

నల్లగొండలోని ఓ బిర్యాని సెంటర్‌లో జరిగిన భారీ పేలుడు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ రోడ్డుపై పూజిత అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న హాట్ బకెట్ బిర్యాని సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ప్రభావంతో మంటలు భారీగా చెలరేగి, షెటర్ గేటుతో పాటు లోపల ఉన్న సామాన్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగటం వల్ల అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి హాని జరుగలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. గ్యాస్ సిలిండర్ పేలిందా లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా షాప్ రాత్రి ఆలస్యంగా తెరిచి ఉంచారని, షాప్ మూసిన 15 నిమిషాల తర్వాతే ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. అయితే, గ్యాస్ సిలిండర్ పేలిన సూచనలు లేవని, మరేదైనా కుట్ర కోణం ఉందా అనే దిశలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి