Breaking News

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గల టంబ్లర్ రిడ్జ్ పట్టణంలో కాల్పుల ఘటనలో మొత్తం 10 మంది మరణించారు.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గల టంబ్లర్ రిడ్జ్ (Tumbler Ridge) పట్టణంలో ఫిబ్రవరి 10, 2026న జరిగిన కాల్పుల ఘటనలో మొత్తం 10 మంది మరణించారు. 


Published on: 11 Feb 2026 11:28  IST

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గల టంబ్లర్ రిడ్జ్ (Tumbler Ridge) పట్టణంలో ఫిబ్రవరి 10, 2026న జరిగిన కాల్పుల ఘటనలో మొత్తం 10 మంది మరణించారు. మొత్తం 10 మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్ లోపల, ఇద్దరు ఒక నివాస గృహంలో మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.షూటర్ కూడా మరణించిన 10 మందిలో ఒకరు. నిందితురాలు ఒక మహిళ అని, ఆమె తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనలో సుమారు 25 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ది హిందూ నివేదించింది.కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఇది అత్యంత భయంకరమైన హింసాకాండ అని పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి