Breaking News

సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాలలో ఒకటైన రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది.

మార్చి 2, 2026 సోమవారం నాడు సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాలలో ఒకటైన రాస్ తనురా (Ras Tanura)  రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది.


Published on: 02 Mar 2026 15:14  IST

మార్చి 2, 2026 సోమవారం నాడు సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాలలో ఒకటైన రాస్ తనురా (Ras Tanura)  రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది.

సోమవారం ఉదయం జరిగిన ఈ డ్రోన్ దాడి కారణంగా రిఫైనరీలోని ఒక చమురు నిల్వ కేంద్రం వద్ద చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించింది.సౌదీ అధికారులు మంటలను త్వరగానే అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరగలేదని  తెలిపింది.ముందు జాగ్రత్త చర్యగా సౌదీ అరామ్కో (Saudi Aramco) ఈ రిఫైనరీలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. రాస్ తనురా రోజుకు సుమారు 5,50,000 బారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంది.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల్లో భాగంగా ఇరాన్ ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.ఈ వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగి, బారెల్ $80 మార్కుకు చేరుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి