Breaking News

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, తన కుమార్తె కిమ్ జు యేతో కలిసి అత్యాధునిక యుద్ధ ట్యాంకర్‌ను నడుపుతూ షికారు

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, తన కుమార్తె కిమ్ జు యేతో కలిసి మార్చి 19, 2026న ఒక అత్యాధునిక యుద్ధ ట్యాంకర్‌ను నడుపుతూ కనిపించారు.


Published on: 20 Mar 2026 11:38  IST

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, తన కుమార్తె కిమ్ జు యేతో కలిసి మార్చి 19, 2026న ఒక అత్యాధునిక యుద్ధ ట్యాంకర్‌ను నడుపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ (KCNA) మార్చి 20, 2026న విడుదల చేసింది. 

కిమ్ జు యే ట్యాంకర్ డ్రైవర్ సీటులో కూర్చుని ట్యాంక్‌ను నడపగా, కిమ్ జోంగ్ ఉన్ ఆమె వెనుక నిలబడి చిరునవ్వుతో కనిపించారు.రాజధాని ప్యోంగ్యాంగ్‌లోని 60వ శిక్షణా కేంద్రంలో జరిగిన ఇన్ఫంట్రీ మరియు ట్యాంక్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన సైనిక కవాతులో వీరు పాల్గొన్నారు.

డ్రోన్లు మరియు యాంటీ-ట్యాంక్ క్షిపణులను అడ్డుకోగల సామర్థ్యం కలిగిన కొత్త రకం మెయిన్ బాటిల్ ట్యాంకర్‌ను కిమ్ ఈ సందర్భంగా పరీక్షించారు.ఇటీవల కాలంలో కిమ్ తన కుమార్తెను వరుసగా సైనిక కార్యక్రమాలకు తీసుకురావడం చూస్తుంటే, ఆమెను తన రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దుతున్నారనే వాదనలకు బలం చేకూరుతోంది.ఈ పర్యటనలో కిమ్ మరియు ఆయన కుమార్తె ఇద్దరూ ఒకే రకమైన నలుపు రంగు లెదర్ జాకెట్లు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Follow us on , &

ఇవీ చదవండి