Breaking News

అమెరికాలో ఒక ప్రయాణికుడి బ్లూటూత్ డివైజ్ పేరు 'బాంబ్' అని ఉండటం వల్ల విమానంలో తీవ్ర కలకలం రేగి, చివరికి విమానం గాల్లోనే యూటర్న్ తీసుకుని అత్యవసరంగా ల్యాండ్ అయింది.

అమెరికాలో ఒక ప్రయాణికుడి బ్లూటూత్ డివైజ్ పేరు 'బాంబ్' అని ఉండటం వల్ల విమానంలో తీవ్ర కలకలం రేగి, చివరికి విమానం గాల్లోనే యూటర్న్ తీసుకుని అత్యవసరంగా ల్యాండ్ అయింది.

Published on: 01 Jun 2026 17:17  IST

అమెరికాలో ఒక ప్రయాణికుడి బ్లూటూత్ డివైజ్ పేరు 'బాంబ్' అని ఉండటం వల్ల విమానంలో తీవ్ర కలకలం రేగి, చివరికి విమానం గాల్లోనే యూటర్న్ తీసుకుని అత్యవసరంగా ల్యాండ్ అయింది.

యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 767 విమానం (UA236), అమెరికాలోని న్యూజెర్సీ (నెవార్క్‌) నుంచి స్పెయిన్‌కు బయల్దేరింది. ఇందులో 190 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన సుమారు గంటన్నర తర్వాత, ఒక ప్రయాణికుడు తన ఫోన్‌లో సమీపంలోని బ్లూటూత్ నెట్‌వర్క్‌లను చూస్తున్నప్పుడు 'BOMB' అనే పేరు గల ఒక డివైజ్ యాక్టివ్‌గా ఉండటాన్ని గమనించి సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.విమాన సిబ్బంది వెంటనే అలర్ట్ అయి, ప్రయాణికులందరూ తమ బ్లూటూత్ కనెక్షన్లను వెంటనే ఆపేయాలని మైకులో పదేపదే అనౌన్స్ చేశారు. ఆఖరికి "ఒక్క నిమిషంలో బ్లూటూత్ ఆఫ్ చేయకపోతే విమానాన్ని వెనక్కి మళ్లిస్తాం" అని అల్టిమేటం కూడా ఇచ్చారు. సిబ్బంది హెచ్చరించినప్పటికీ ఆ 'బాంబ్' పేరు గల డివైజ్ (మరో రెండు డివైజ్‌లతో పాటు) యాక్టివ్‌గానే చూపిస్తూ వచ్చింది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్లు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి మళ్లించి (U-Turn), నెవార్క్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.విమానం ల్యాండ్ అవ్వగానే భద్రతా సంస్థలు లోపలికి వచ్చి తనిఖీలు చేపట్టాయి. ఒక టీనేజ్ (మైనర్) ప్రయాణికుడు ఆకతాయి తనంతో తన బ్లూటూత్ స్పీకర్ లేదా డివైజ్ పేరును అలా మార్చి ప్రాంక్ (Prank) చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఈ విచిత్రమైన ఘటన వల్ల ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement