Breaking News

అమెరికాలోని చికాగో నగరంలో ఈ వారాంతంలో నగరవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా కాల్పుల ఘటనలు

అమెరికాలోని చికాగో నగరంలో జూన్ 19 రాత్రి నుండి జరిగిన వరుస కాల్పుల్లో కనీసం 8 మంది మరణించగా, 38 మందికి పైగా గాయపడ్డారు. చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్ నివేదికల ప్రకారం ఈ వారాంతంలో నగరవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.


Published on: 22 Jun 2026 11:55  IST

అమెరికాలోని చికాగో నగరంలో జూన్ 19 రాత్రి నుండి జరిగిన వరుస కాల్పుల్లో కనీసం 8 మంది మరణించగా, 38 మందికి పైగా గాయపడ్డారు. చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్ నివేదికల ప్రకారం ఈ వారాంతంలో నగరవ్యాప్తంగా రెండు డజన్లకు పైగా కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.

ప్రధాన ఘటన

జూన్ 19 శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో, చికాగో సౌత్ సైడ్ లోని ప్రిన్స్‌టన్ పార్క్ వద్ద ప్రజలు గుమిగూడి ఉండగా ఒక ఎరుపు రంగు SUV కారు వచ్చింది. అందులోని ఇద్దరు దుండగులు గుంపుపైకి అంధాధుంధాగా కాల్పులు జరిపి పారిపోయారు.ఈ ఒక్క ఘటనలోనే 13 మంది గాయపడ్డారు. బాధితుల వయసు 17 నుండి 47 ఏళ్ల మధ్య ఉంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రాంతంలో పోలీసులు సుమారు 100 కి పైగా బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు.

వారాంతంలో జరిగిన వేర్వేరు కాల్పుల్లో 14 ఏళ్ల బాలుడితో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో 14 నుండి 70 ఏళ్ల వయసు గలవారు ఉన్నారు.నార్త్ లాండేల్, ఎంజిల్‌వుడ్, వెస్ట్ సైడ్ వంటి పలు ప్రాంతాల్లో ఈ హింసాత్మక ఘటనలు జరిగాయి.

రాజకీయ ప్రతిస్పందన

చికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్ ఈ ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పండుగ పూట ఇలాంటి హింస జరగడం చాలా బాధాకరమని ట్వీట్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ హింసపై స్పందిస్తూ, చికాగోలో శాంతిభద్రతలను అదుపు చేయడానికి మిలిటరీ లేదా నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దించాలని ఇల్లినోయిస్ గవర్నర్‌ను కోరారు.ప్రస్తుతం చికాగో పోలీసులు ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

 

Follow us on , &

ఇవీ చదవండి