Breaking News

టర్కీ ప్రభుత్వం కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి చెందిన వేలాది మంది కుర్దు మిలిటెంట్లకు షరతులతో కూడిన క్షేమాభిక్ష కల్పించే చారిత్రాత్మక బిల్లుపై సంతకం చేసింది

టర్కీ ప్రభుత్వం కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి చెందిన వేలాది మంది కుర్దు మిలిటెంట్లకు షరతులతో కూడిన క్షేమాభిక్ష కల్పించే చారిత్రాత్మక బిల్లుపై సంతకం చేసింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈ చట్టాన్ని ఆమోదించగా, 19 ఆగస్టు 2026 నాటి అధికారిక గెజెట్ లో ఇది ప్రచురితమైంది.


Published on: 19 Aug 2026 11:58  IST

టర్కీ ప్రభుత్వం కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి చెందిన వేలాది మంది కుర్దు మిలిటెంట్లకు షరతులతో కూడిన క్షేమాభిక్ష కల్పించే చారిత్రాత్మక బిల్లుపై సంతకం చేసింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈ చట్టాన్ని ఆమోదించగా, 19 ఆగస్టు 2026 నాటి అధికారిక గెజెట్ లో ఇది ప్రచురితమైంది. నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న రక్తపాత సంఘర్షణలకు ముగింపు పలికేందుకు ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచింది.

చట్టం యొక్క ముఖ్య నిబంధనలు

షరతులతో కూడిన క్షమాభిక్ష: ఇది అందరికీ వర్తించే సాధారణ క్షమాభిక్ష కాదు. తీవ్రమైన నేరారోపణలు లేని, కేవలం తక్కువ స్థాయి కేడర్ కలిగిన మిలిటెంట్లకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది.

శిక్షల నిలిపివేత: లొంగిపోయిన మిలిటెంట్లపై ఉన్న విచారణలు, జైలు శిక్షలను నేర తీవ్రతను బట్టి 5 నుండి 10 సంవత్సరాల పాటు నిలిపివేస్తారు. ఈ కాలంలో వారు ఎలాంటి నేరాలకు పాల్పడకపోతే, వారిపై ఉన్న కేసులను పూర్తిగా కొట్టివేస్తారు.

ప్రారంభ విడత విడుదల: తొలి దశలో భాగంగా జైళ్లలో ఉన్న దాదాపు 3,500 మంది PKK సానుభూతిపరులు లేదా మిలిటెంట్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

మినహాయింపులు మరియు పరిమితులు

అబ్దుల్లా ఓకలాన్‌కు క్షమాభిక్ష లేదు: PKK వ్యవస్థాపకుడు మరియు ప్రస్తుతం జైలులో ఉన్న అబ్దుల్లా ఓకలాన్ తో పాటు ఇతర ముఖ్య అగ్రనేతలకు ఈ క్షేమాభిక్ష వర్తించదు.

తీవ్రమైన నేరాలకు నో ఛాన్స్: జూన్ 1, 2005 కంటే ముందు జరిగిన ఘోరమైన హత్యలు ,జీవిత ఖైదు పడిన తీవ్రవాద నేరస్థులకు ఈ చట్టం నుండి మినహాయింపు లేదు.

అమలు ప్రక్రియ

పూర్తి నిరాయుధీకరణ: PKK గ్రూప్ తన ఆయుధాలను పూర్తిగా వదిలివేసి, సంస్థను రద్దు చేసుకున్నట్లు టర్కీ జాతీయ భద్రతా మండలి ధృవీకరించిన తర్వాతే ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుంది.

పర్యవేక్షణ కమిటీ: ఈ నిరాయుధీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి టర్కీ వైస్ ప్రెసిడెంట్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. దీని మొదటి సమావేశం ఆగస్టు 24, 2026 న జరగనుంది.

ఈ చట్టం ద్వారా వేలాది మంది మాజీ మిలిటెంట్లు ఆయుధాలు వీడి సాధారణ పౌర జీవితంలోకి తిరిగి రావడానికి మార్గం సుగమమైంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement