Breaking News

స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్‌లో తయారైన మూడు రకాల ప్రత్యేకమైన, అవార్డులు గెలుచుకున్న ఆర్టిసానల్ చీజ్‌లను బహుమతిగా అందించారు.

భారత పర్యటనకు వచ్చిన స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్‌లో తయారైన మూడు రకాల ప్రత్యేకమైన, అవార్డులు గెలుచుకున్న ఆర్టిసానల్ చీజ్‌లను బహుమతిగా అందించారు.


Published on: 06 Oct 2026 11:51  IST

భారత పర్యటనకు వచ్చిన స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్‌లో తయారైన మూడు రకాల ప్రత్యేకమైన, అవార్డులు గెలుచుకున్న ఆర్టిసానల్ చీజ్‌లను బహుమతిగా అందించారు. ప్రపంచవ్యాప్తంగా చీజ్ తయారీకి స్విట్జర్లాండ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాంటి దేశ అధ్యక్షుడికి భారతదేశపు పాల ఉత్పత్తుల నాణ్యతను, ఇక్కడి చీజ్ తయారీ నైపుణ్యాన్ని పరిచయం చేయడానికి మోదీ ఈ వినూత్న కానుకను ఎంచుకున్నారు.

గుల్మార్గ్ : ఇది ఆవు పాలతో తయారయ్యే గుండె ఆకారంలో ఉండే సాఫ్ట్ అండ్ క్రీమీ చీజ్. దీనికి బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీ లో 'సూపర్ గోల్డ్' అవార్డు లభించింది.

కోణార్క్ : ఇది మట్టి వాసన, నిమ్మరసం లాంటి స్వల్ప రుచితో కూడిన ప్రత్యేకమైన చీజ్. దీనికి 2023 వరల్డ్ చీజ్ అవార్డ్స్‌లో గోల్డ్ మెడల్, అలాగే 2025లో స్విట్జర్లాండ్‌లోనే జరిగిన పోటీలో సిల్వర్ మెడల్ లభించాయి.

యూర్‌ : ఇది స్విస్ సాంప్రదాయ 'గ్రూయేర్' చీజ్ స్ఫూర్తితో రూపొందించబడింది. దీనిపై గులాబీ రేకులు, సోంపు గింజలను అలంకరించి పక్కా భారతీయ శైలిని జోడించారు.

ఇతర బహుమతులు:
చీజ్‌లతో పాటు స్విస్ అధ్యక్షుడికి హిమాలయన్ వాల్‌నట్ కలపతో చేతితో చెక్కిన కశ్మీరీ వాల్ ప్యానెల్‌ను, అలాగే ఆయన భార్య కరొలిన్ పార్మెలిన్‌కు గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ 'కచ్చీ షాల్', 'సదేలీ బాక్స్'లను మోదీ కానుకగా ఇచ్చారుఈ మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మరియు సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement