Breaking News

ది మైసన్‌ డెస్‌ లుమైరేస్‌ మ్యూజియంలో కూడా దోపిడీ

ఫ్రాన్స్‌లోని లావ్రే మ్యూజియంతో పాటు, 2025 అక్టోబర్ 24న ది మైసన్‌ డెస్‌ లుమైరేస్‌ మ్యూజియంలో కూడా దోపిడీ జరిగింది.


Published on: 24 Oct 2025 10:03  IST

ఫ్రాన్స్‌లోని లావ్రే మ్యూజియంతో పాటు, 2025 అక్టోబర్ 24న ది మైసన్‌ డెస్‌ లుమైరేస్‌ మ్యూజియంలో కూడా దోపిడీ జరిగింది. అక్టోబర్ 19, 2025న లావ్రే మ్యూజియంలో చోరీ జరిగింది.నిర్మాణ కార్మికులుగా వేషం వేసుకున్న నలుగురు దొంగలు, ఫర్నిచర్‌ లిఫ్ట్‌ ఉపయోగించి లోపలికి ప్రవేశించారు.వారు దాదాపు 900 కోట్ల రూపాయల విలువైన ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్‌ను అపోలో గ్యాలరీ నుంచి దోచుకెళ్లారు. అయితే, పారిపోయేటప్పుడు దొంగలు ఎంప్రెస్ యూజెనీ కిరీటాన్ని జారవిడిచారు.ఈ ఘటన తర్వాత, అధికారులు మ్యూజియం భద్రత లోపాలను అంగీకరించారు, దర్యాప్తు కొనసాగుతోంది. 

లావ్రే మ్యూజియం దోపిడీ జరిగిన కొద్ది గంటల తర్వాత ది మైసన్‌ డెస్‌ లుమైరేస్‌ మ్యూజియంలో కూడా దోపిడీ జరిగింది.ఈ దోపిడీలో 2వేల బంగారు, వెండి నాణేలు అపహరణకు గురయ్యాయి.ఈ నాణేలను 2011లో మ్యూజియం ఉన్న భవనం పునరుద్ధరణ సమయంలో కనుగొన్నారు. అవి 1790 మరియు 1840 మధ్య కాలానికి చెందినవి.అధికారులు ఈ దోపిడీపై దర్యాప్తు ప్రారంభించారు. 

Follow us on , &

ఇవీ చదవండి