Breaking News

కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్ దారుణ హత్యకు గురయ్యారు.

కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్ (45) దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్ మూలాలున్న ఆమె, అంటారియో ప్రావిన్స్‌లోని విండ్సర్ సమీపంలో ఉన్న లాసెల్లె (LaSalle) లో నివసిస్తున్నారు. 

Published on: 06 Mar 2026 11:57  IST

కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్ (45) దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్ మూలాలున్న ఆమె, అంటారియో ప్రావిన్స్‌లోని విండ్సర్ సమీపంలో ఉన్న లాసెల్లె (LaSalle) లో నివసిస్తున్నారు. 

మార్చి 3, 2026 (మంగళవారం) రాత్రి సుమారు 9:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ దాడి జరిగింది.టాడ్ లేన్‌లోని ఆమె నివాసంలోనే గుర్తు తెలియని దుండగులు ఆమెపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.

ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఖలిస్తాన్ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా, అలాగే పంజాబ్ రాజకీయాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు గతంలో బెదిరింపులు వచ్చాయని ఆమె తల్లి పేర్కొన్నారు.లాసెల్లె పోలీసులు దీనిని ఒక పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా (Targeted Homicide) భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరినీ అరెస్టు చేయలేదు, దర్యాప్తు కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి