Breaking News

హోర్ముజ్లో మైన్లు వేస్తున్న ఇరాన్ చిన్న పడవలను కనిపిస్తే వెంటనే "కాల్చివేయ్యాలని"  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ యుఎస్ నావికాదళానికి ఆదేశాలు

హోర్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) మైన్లు వేస్తున్న ఇరాన్ చిన్న పడవలను కనిపిస్తే వెంటనే "కాల్చివేయ్యాలని" (Shoot and Kill) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 23, 2026న యుఎస్ నావికాదళానికి ఆదేశాలు జారీ చేశారు. 


Published on: 24 Apr 2026 10:17  IST

హోర్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) మైన్లు వేస్తున్న ఇరాన్ చిన్న పడవలను కనిపిస్తే వెంటనే "కాల్చివేయ్యాలని" (Shoot and Kill) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 23, 2026న యుఎస్ నావికాదళానికి ఆదేశాలు జారీ చేశారు. 

హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లు అమర్చుతూ ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ చిన్న పడవలను (Small boats) ఏ మాత్రం సంకోచం లేకుండా కాల్చివేయాలని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం జలసంధిలో మైన్లను తొలగించే ప్రక్రియను నావికాదళం ముమ్మరం చేసిందని, ఈ పనిని మూడు రెట్లు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.ఒక ఒప్పందం కుదిరే వరకు హోర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉంటుందని, అమెరికా అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక కూడా అక్కడి నుండి ప్రయాణించడానికి వీల్లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ ఆదాయాన్ని (రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్లు) అడ్డుకోవడమే తమ వ్యూహమని ఆయన తెలిపారు.యుద్ధాన్ని ముగించడానికి తమకేం తొందర లేదని, కానీ ఇరాన్ నాయకత్వంలోని విభేదాల వల్ల వారికి సమయం మించిపోతోందని ("The clock is ticking") ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో, లెబనాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణను మరో మూడు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement