Breaking News

సుదీక్ష కోణంకి కేసులో షాకింగ్ ట్విస్ట్.. తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించమంటూ తల్లిదండ్రుల అభ్యర్థన

భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి అదృశ్యం కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం అందరికీ తెలిసిందే.


Published on: 18 Mar 2025 16:15  IST

ఆమె మిస్సై 12 రోజులు కావొస్తుండగా.. పోలీసులు మాత్రం ఇంకా ఆమె కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా సుదీక్ష తల్లిదండ్రులు ఈ ఘటనపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తమ కుమార్తె చనిపోయిందని ప్రకటించాలని డొమినికన్ అధికారులను కోరినట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ముందు నుంచి తమ కూతురు కిడ్నాప్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేసిన వీళ్లే ఈ కామెంట్లు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. 

అమెరికా మీడియా నివేదికల ప్రకారం, భారతీయ విద్యార్థిని సుదీక్ష కోనంకి అదృశ్యమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 20 ఏళ్ల కోనంకి, యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వత నివాసిగా ఉంటూ విద్యనభ్యసిస్తోంది.సుదీక్ష కోణంకి.. ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి ఇటీవలే విహార యాత్ర కోసం డొమినికా రిపబ్లిక్ దేశానికి వెళ్లింది. అక్కడే ప్యూంటా కానా పట్టణానికి వెళ్లిన ఆమె మార్చి 6వ తేదీన రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద చివరి సారిగా కనిపించింది. తెల్లవారుజాము 3 గంటల వరకు స్నేహితులంతా కలిసి అక్కడే పార్టీ చేసుకోగా ఆ తర్వాత అందరూ హోటల్‌కు వెళ్లిపోయారు. కానీ సుదీక్ష కోణంకి ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్నేహితులంతా వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 కోనంకి కుటుంబం డొమినికన్ రిపబ్లిక్ అధికారులను ఆమె మరణించినట్లు ప్రకటించాలని కోరింది. కుటుంబ సభ్యులు అధికారులకు లేఖ పంపారు, దానిలో ఆమె మరణాన్ని అంగీకరించారు.అధికారిక ప్రకటన కోసం అవసరమైన చట్టపరమైన విధానాలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

 

Follow us on , &

ఇవీ చదవండి