Breaking News

భారతీయ విద్యార్థిని విమానంలో ఫోర్క్‌తో ప్రయాణికులపై దాడి చేసింది.

విమానంలో ఫోర్క్‌తో ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి అనే 28 ఏళ్ల భారతీయ విద్యార్థిని అమెరికాలో అరెస్టు చేశారు.


Published on: 28 Oct 2025 14:20  IST

విమానంలో ఫోర్క్‌తో ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి అనే 28 ఏళ్ల భారతీయ విద్యార్థిని అమెరికాలో అరెస్టు చేశారు. 2025 అక్టోబరు 25న చికాగో నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానంలో ఈ సంఘటన జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల వయసున్న ఇద్దరు టీనేజర్‌లపై ఉసిరిపల్లి మెటల్ ఫోర్క్‌తో దాడి చేశాడు. ఒకరికి భుజంపై, మరొకరికి తల వెనుక భాగంలో గాయాలయ్యాయి.ఈ దాడితో పాటు, అతను విమానంలోని మరో మహిళను కొట్టాడు మరియు సిబ్బందిపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు.

ఈ సంఘటనతో విమానంలో గందరగోళం చెలరేగింది. దీంతో విమానం బోస్టన్‌లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసరంగా మళ్లించబడింది.బోస్టన్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఉసిరిపల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఉసిరిపల్లిపై "ప్రమాదకరమైన ఆయుధంతో దాడి"కి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. అమెరికాలో అతని స్టూడెంట్ వీసా గడువు ముగిసిందని కూడా అధికారులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి