Breaking News

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా (80) మంగళవారం ఉదయం కన్నుమూశారు. 

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా (80) 2025, డిసెంబర్ 30వ తేదీన మంగళవారం ఉదయం కన్నుమూశారు. 


Published on: 30 Dec 2025 16:55  IST

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా (80) 2025, డిసెంబర్ 30వ తేదీన మంగళవారం ఉదయం కన్నుమూశారు. 

ఆమె ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.గత కొంతకాలంగా ఆమె గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలు మరియు మధుమేహంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా నవంబర్ 23న ఆసుపత్రిలో చేరగా, డిసెంబర్ 11 నుండి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

ఖలీదా జియా బంగ్లాదేశ్‌కు మొదటి మహిళా ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. ఆమె మొత్తం మూడు సార్లు (1991-1996 మరియు 2001-2006 మధ్య) ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఆమె మరణానికి కొద్దిరోజుల ముందే, గత 17 ఏళ్లుగా లండన్‌లో ఉంటున్న ఆమె కుమారుడు తారీఖ్ రెహ్మాన్ డిసెంబర్ 25న స్వదేశానికి తిరిగి వచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి