Breaking News

H-1B వీసా నిబంధనలలో అమెరికా ప్రభుత్వం (USCIS) విప్లవాత్మక మార్పులను అమలులోకి తెచ్చింది

27 మార్చి 2026 నాటికి, H-1B వీసా నిబంధనలలో అమెరికా ప్రభుత్వం (USCIS) విప్లవాత్మక మార్పులను అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా FY 2027 (అక్టోబర్ 2026 నుండి ప్రారంభమయ్యే ఉద్యోగాల) కోసం ఈ మార్పులు వర్తిస్తాయి. 


Published on: 27 Mar 2026 17:42  IST

27 మార్చి 2026 నాటికి, H-1B వీసా నిబంధనలలో అమెరికా ప్రభుత్వం (USCIS) విప్లవాత్మక మార్పులను అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా FY 2027 (అక్టోబర్ 2026 నుండి ప్రారంభమయ్యే ఉద్యోగాల) కోసం ఈ మార్పులు వర్తిస్తాయి. పాత పద్ధతిలో ఉండే రాండమ్ లాటరీ విధానం స్థానంలో ఇప్పుడు జీతం మరియు నైపుణ్యం ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎక్కువ జీతం మరియు ఉన్నత స్థాయి పదవి (Level 4) ఉన్న వారికి లాటరీలో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Level IV: 4 లాటరీ ఎంట్రీలు లభిస్తాయి.

Level III: 3 లాటరీ ఎంట్రీలు.

Level II: 2 లాటరీ ఎంట్రీలు.

Level I (Entry Level): కేవలం 1 లాటరీ ఎంట్రీ మాత్రమే లభిస్తుంది.

భారీగా పెరిగిన ఫీజులు:

కొత్త హెచ్-1బీ పిటిషన్ల కోసం యజమానులు అదనంగా $1,00,000 (సుమారు ₹84 లక్షలు) వన్-టైమ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న వీసా హోల్డర్లకు లేదా రెన్యూవల్స్‌కు వర్తించదు.రిజిస్ట్రేషన్ ఫీజు కూడా $10 నుండి $215 కు పెంచబడింది.

సోషల్ మీడియా స్క్రీనింగ్: వీసా స్టాంపింగ్ లేదా రెన్యూవల్ సమయంలో గత 5 ఏళ్ల సోషల్ మీడియా హిస్టరీని కఠినంగా పరిశీలిస్తున్నారు.

కీలక తేదీలు (FY 2027):

రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 19, 2026 తో ముగిసింది.

లాటరీ ఫలితాలను మార్చి 31, 2026 నాటికి ఆన్‌లైన్ అకౌంట్ల ద్వారా వెల్లడిస్తారు.

ఎంపికైన వారు ఏప్రిల్ 1 నుండి జూన్ 30, 2026 వరకు పూర్తి పిటిషన్లను ఫైల్ చేయవచ్చు.

కొన్ని అపాయింట్‌మెంట్లు 2027 వరకు వాయిదా పడుతున్నాయి. ఈ మార్పుల వల్ల తక్కువ జీతంతో వచ్చే కన్సల్టెన్సీ ఉద్యోగాలకు ఆవకాశాలు తగ్గి, ఎక్కువ నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులకు ప్రాధాన్యత పెరగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి