Breaking News

న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు దాదాపు 53 ఏళ్ల తర్వాత NBA ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో భారీ ఎత్తున సంబరాలు

న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు దాదాపు 53 ఏళ్ల తర్వాత NBA ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో, న్యూయార్క్ నగరవ్యాప్తంగా అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.


Published on: 17 Jun 2026 10:15  IST

న్యూయార్క్ నిక్స్ బాస్కెట్‌బాల్ జట్టు దాదాపు 53 ఏళ్ల తర్వాత NBA ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకోవడంతో, న్యూయార్క్ నగరవ్యాప్తంగా అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అయితే జూన్ 13 శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత (జూన్ 14 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో) ఈ వేడుకలు కాస్త హింసాత్మకంగా మారాయి.

టైమ్స్ స్క్వేర్‌లోని 42 స్ట్రీట్ మరియు బ్రాడ్‌వే జంక్షన్ వద్ద ఈ కాల్పులు జరిగాయి.ఈ ఘర్షణలో 17 ఏళ్ల యువకుడి ఎడమ కాలికో బుల్లెట్ గాయమైంది. భారీగా గుమిగూడిన జనం వల్ల అంబులెన్స్ లోపలికి రాలేకపోవడంతో, న్యూయార్క్ పోలీసులు ఆ యువకుడిని తమ పోలీస్ వాహనంలోనే హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉంది.రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య జరిగిన ఘర్షణే ఈ కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.ఘటన స్థలం నుండి పోలీసులు లోడ్ చేసిన ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకోగా, పరారైన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ వేడుకల సమయంలో కేవలం కాల్పులే కాకుండా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది.

నగరంలో ఉన్న కొన్ని వరల్డ్ కప్ రవాణా బస్సులపైకి జనాలు ఎక్కి, అద్దాలు పగలగొట్టి, అందులో ఒక బస్సుకు నిప్పు పెట్టారు.అల్లర్లను అదుపు చేయడానికి వచ్చిన 10 మందికి పైగా పోలీస్ అధికారులపై గాజు సీసాలతో దాడులు జరగడం వల్ల వారు గాయపడ్డారు.ఈ సంబరాలు మరియు అల్లర్ల నేపథ్యంలో న్యూయార్క్ వ్యాప్తంగా పోలీసులు దాదాపు 63 మందిని అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement