Breaking News

రష్యాలో కత్తిపోట్ల ఘటనలో గాయపడిన నలుగురు భారతీయ విద్యార్థుల వేగంగా కోలుకుంటున్నారని భారత ప్రభుత్వం వెల్లడించింది.

రష్యాలో ఫిబ్రవరి 7, 2026 శనివారం నాడు జరిగిన కత్తిపోట్ల ఘటనలో గాయపడిన నలుగురు భారతీయ విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారు వేగంగా కోలుకుంటున్నారని భారత ప్రభుత్వం వెల్లడించింది. 


Published on: 09 Feb 2026 14:26  IST

రష్యాలో ఫిబ్రవరి 7, 2026 శనివారం నాడు జరిగిన కత్తిపోట్ల ఘటనలో గాయపడిన నలుగురు భారతీయ విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారు వేగంగా కోలుకుంటున్నారని భారత ప్రభుత్వం వెల్లడించింది. 

రష్యాలోని బాష్కోర్తోస్థాన్‌ రిపబ్లిక్‌లో ఉన్న ఉఫా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లో ఈ దాడి చోటుచేసుకుంది.ఈ దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. విద్యార్థులను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా గాయపడినట్లు సమాచారం.

ప్రస్తుతం గాయపడిన విద్యార్థులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారత రాయబార కార్యాలయ అధికారులు ఆదివారం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నట్లు  నివేదించింది.

15 ఏళ్ల ఓ రష్యన్ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతనికి నిషేధిత నియో-నాజీ (Neo-Nazi) సంస్థతో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాడి సమయంలో అతను విదేశీయులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది.

భారత రాయబార కార్యాలయం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు భారత్ తెలిపింది. ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA) కూడా ఈ ఘటనపై స్పందిస్తూ విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతను మెరుగుపరచాలని ప్రధానికి లేఖ రాసింది. 

Follow us on , &

ఇవీ చదవండి