Breaking News

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఒక రైలు లక్ష్యంగా ఘోర ఆత్మాహుతి ఉగ్రదాడి

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఒక రైలు లక్ష్యంగా ఘోర ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగింది. మే 24, 2026 ఆదివారం ఉదయం జరిగిన ఈ భీకర పేలుడులో 30 మంది దుర్మరణం చెందగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.


Published on: 25 May 2026 11:50  IST

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఒక రైలు లక్ష్యంగా ఘోర ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగింది. మే 24, 2026 ఆదివారం ఉదయం జరిగిన ఈ భీకర పేలుడులో 30 మంది దుర్మరణం చెందగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

క్వెట్టా నుండి పెషావర్‌కు ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలోని చమన్ పట్టక్ సిగ్నల్ (గేట్) సమీపంలో ఈ ఘోరం జరిగింది. పేలుడు పదార్థాలతో ఉన్న ఒక వాహనంతో రైలును ఢీకొట్టి ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.పేలుడు తీవ్రతకు రైలులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీనివల్ల మూడు బోగీలు పట్టాలు తప్పాయి.ఈ ప్రమాదంలో మరణించిన మరియు గాయపడిన వారిలో ఎక్కువ మంది పాకిస్థాన్ సైనిక సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దాడి జరిగిన సమయంలో ఆ రైలులో దాదాపు 300 మందికి పైగా పాక్ సైనికులు ప్రయాణిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.ఈ దారుణ ఉగ్రదాడికి తామే బాధ్యులమని నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కి చెందిన ‘మాజీద్ బ్రిగేడ్’ అధికారికంగా ప్రకటించుకుంది.ఈ దాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు, సైనికులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడి అత్యంత పిరికిపంద చర్య అని ఆయన విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement