Breaking News

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థను రూ. 9.15 లక్షల కోట్ల విలువైన డీల్‌తో పారామౌంట్ స్కైడాన్స్ కొనుగోలు చేయడానికి ఆ సంస్థ వాటాదారుల ఆమోదం

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WBD) సంస్థను సుమారు రూ. 9.15 లక్షల కోట్ల ($110 బిలియన్లు) విలువైన డీల్‌తో పారామౌంట్ స్కైడాన్స్ (Paramount Skydance) కొనుగోలు చేయడానికి ఆ సంస్థ వాటాదారులు (Shareholders) ఏప్రిల్ 23, 2026న ఆమోదం తెలిపారు. 

Published on: 24 Apr 2026 10:55  IST

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WBD) సంస్థను సుమారు రూ. 9.15 లక్షల కోట్ల ($110 బిలియన్లు) విలువైన డీల్‌తో పారామౌంట్ స్కైడాన్స్ (Paramount Skydance) కొనుగోలు చేయడానికి ఆ సంస్థ వాటాదారులు (Shareholders) ఏప్రిల్ 23, 2026న ఆమోదం తెలిపారు. 

ఈ విక్రయం విలువ సుమారు $110 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 9.15 లక్షల కోట్లు) గా నిర్ణయించబడింది. ఇందులో రుణాల (Debt) విలువ కూడా కలిసి ఉంది.పారామౌంట్ సంస్థ ఒక్కో WBD షేర్‌కు $31 చొప్పున నగదు చెల్లించడానికి అంగీకరించింది.

ఈ కొనుగోలు రేసులో మొదట నెట్‌ఫ్లిక్స్ (Netflix) ముందున్నప్పటికీ, పారామౌంట్ భారీ ఆఫర్‌తో నెట్‌ఫ్లిక్స్‌ను వెనక్కి నెట్టి ఈ డీల్‌ను దక్కించుకుంది.ఈ విక్రయ ప్రక్రియ 2026 మూడవ త్రైమాసికం నాటికి (సెప్టెంబర్ 30 లోపు) పూర్తి కావచ్చని అంచనా.ఈ విలీనం తర్వాత HBO, CNN, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, డిస్కవరీ ఛానెల్ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లన్నీ పారామౌంట్ గ్రూప్‌లో భాగమవుతాయి. ప్రస్తుతం ఈ డీల్‌కు షేర్‌హోల్డర్ల ఆమోదం లభించినప్పటికీ, అమెరికా మరియు ఐరోపా దేశాల రెగ్యులేటరీ అథారిటీల (అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు) తుది అనుమతులు రావాల్సి ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి