Breaking News

వాల్‌మార్ట్ కొత్త H-1B అభ్యర్థుల నియామకాలకి నో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా విధించిన $100,000 వీసా ఫీజు కారణంగా వాల్‌మార్ట్ సంస్థ కొత్త H-1B అభ్యర్థుల నియామకాలను నిలిపివేసింది.


Published on: 22 Oct 2025 15:00  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా విధించిన $100,000 వీసా ఫీజు కారణంగా వాల్‌మార్ట్ సంస్థ కొత్త H-1B అభ్యర్థుల నియామకాలను నిలిపివేసింది. ఈ ఫీజు అమెరికా వెలుపల ఉన్న కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది, ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి లేదా వీసా పునరుద్ధరణ చేసుకునే వారికి కాదు అని అధికారులు స్పష్టం చేశారు. 

కొత్త H-1B దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు ₹83 లక్షలు) వన్-టైమ్ ఫీజు భారం కంపెనీలపై పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది.వాల్‌మార్ట్‌లో ఇప్పటికే H-1B వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల స్టేటస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టమైంది. ఈ నిర్ణయం కొత్త నియామకాలకు మాత్రమే వర్తిస్తుంది. అమెరికా వెలుపల ఉండి, కొత్తగా H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మాత్రమే ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అక్టోబర్ 20న ఈ ఫీజు అమలు, మినహాయింపులపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త ఫీజు నిబంధన, వాల్‌మార్ట్ వంటి కంపెనీల నియామకాల నిలిపివేతతో అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితి వల్ల అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల వివాహ ప్రణాళికలు, కెరీర్ ఆశలు ప్రభావితమవుతున్నాయని గుడ్ రిటర్న్స్ పేర్కొంది.ఈ నిబంధనలు దీర్ఘకాలంలో భారతీయ ఐటీ రంగంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు

Follow us on , &

ఇవీ చదవండి