Breaking News

ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానం రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో షేక్ హసీనాకు ఒక్కో కేసులో ఐదేళ్ల చొప్పున మొత్తం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఫిబ్రవరి 2, 2026న ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానం రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో షేక్ హసీనాకు ఒక్కో కేసులో ఐదేళ్ల చొప్పున మొత్తం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.


Published on: 03 Feb 2026 18:45  IST

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఉదంతం గురించి తాజా వివరాలు ఇక్కడ ఉన్నాయ.ఫిబ్రవరి 2, 2026న ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానం రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో షేక్ హసీనాకు ఒక్కో కేసులో ఐదేళ్ల చొప్పున మొత్తం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఢాకా సమీపంలోని 'రాజక్ న్యూ టౌన్' (పూర్బాచల్) ప్రాజెక్టులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను కేటాయించారనే ఆరోపణలపై ఈ శిక్ష పడింది.హసీనాతో పాటు ఆమె బంధువులకు కూడా కోర్టు శిక్షలు ఖరారు చేసింది.ఆమె మేనకోడలు, బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్దిక్ కు 4 ఏళ్ల జైలు శిక్ష.మేనల్లుడు రాద్వాన్ ముజీబ్ సిద్దిక్ బాబీ, మరో మేనకోడలు అజ్మీనా సిద్దిక్ కు 7 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు.

2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా పదవీచ్యుతురాలైన హసీనా, ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విచారణ అంతా ఆమె గైర్హాజరీలోనే (In absentia) జరిగింది.దీనికి ముందు నవంబర్ 2025లో కూడా ఇతర అవినీతి కేసుల్లో ఆమెకు 21 ఏళ్ల జైలు శిక్ష పడింది. 

Follow us on , &

ఇవీ చదవండి