Breaking News

2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి యువ భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన 2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి యువ భారత్ (భారత అండర్-19 జట్టు) విశ్వవిజేతగా నిలిచింది.


Published on: 07 Feb 2026 17:58  IST

జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన 2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ ఘనవిజయం సాధించి రికార్డు స్థాయిలో 6వ సారి టైటిల్‌ను గెలుచుకుంది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 411/9 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 311 పరుగులకే కట్టడి చేసి 100 పరుగుల తేడాతో గెలుపొందింది.

14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేసి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.ఆయూష్ మాత్రే సారథ్యంలో యువ భారత్ ఈ టోర్నీలో అజేయంగా నిలిచి విశ్వవిజేతగా ఆవిర్భవించింది.

భారత బౌలర్లలో అంబ్రిష్ 3 వికెట్లు తీయగా, దీపేశ్ 2 వికెట్లు పడగొట్టారు.అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్‌లో పరుగుల పరంగా ఇది అతిపెద్ద విజయంగా నమోదైంది. ఈ విజయంతో భారత్ అత్యధికంగా 6 సార్లు (2000, 2008, 2012, 2018, 2022, 2026) అండర్-19 టైటిల్ గెలిచిన జట్టుగా తన రికార్డును మరింత సుస్థిరం చేసుకుంది. 

 

Follow us on , &

ఇవీ చదవండి