Breaking News

ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి

7 ఫిబ్రవరి 2026 శనివారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్మరియు ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

Published on: 07 Feb 2026 19:26  IST

7 ఫిబ్రవరి 2026 శనివారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్మరియు ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

కేసీఆర్ పాలనలో ఆకాశాన్ని తాకిన భూముల ధరలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాతాళానికి పడిపోయాయని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆరోపించారు.

గత రెండేళ్లలో గజ్వేల్ అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో ఉందని మండిపడ్డారు.కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని, రైతులకు కనీసం యూరియా కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. 

Follow us on , &

ఇవీ చదవండి