Breaking News

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ వివాహం అక్షితా రాజ్ తో బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అత్యంత వైభవంగా జరిగింది

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ వివాహం అక్షితా రాజ్ తో బుధవారం, 24 జూన్ 2026 న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అత్యంత వైభవంగా జరిగింది.


Published on: 25 Jun 2026 20:02  IST

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ వివాహం అక్షితా రాజ్ తో బుధవారం, 24 జూన్ 2026 న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అత్యంత వైభవంగా జరిగింది.

వివాహ వేడుక విశేషాలు

వారణాసిలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ గంగేస్ లో వీరి వివాహం జరిగింది.ఈ వివాహ వేడుకను పవిత్ర కాశీ నగర ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా ప్రత్యేకమైన శివాలయ థీమ్తో అలంకరించారు.

ఈ వేడుకకు క్రీడా, రాజకీయ ప్రముఖులతో పాటు భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.దాదాపు 300 మందికి పైగా విఐపి అతిథులు హాజరైన ఈ వివాహ వేడుకలో ప్రవేశం కోసం ప్రత్యేకంగా QR కోడ్ స్కానింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు.

వివాహానికి ముందు ఆకాష్ దీప్ స్వగ్రామమైన బీహార్‌లోని రోహతాస్ జిల్లా, బద్ది గ్రామంలో తిలక్, మెహందీ, హల్దీ వేడుకలు జరిగాయి.వివాహ వేడుకల కంటే ముందే బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి స్వయంగా ఆకాష్ దీప్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement