Breaking News

ఇక్కడ అన్నా చెల్లికి పెళ్లి.. కాదంటే కఠిన శిక్ష.. ఎక్కడో తెలుసా..!

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో, పురుషులు తమ అత్త కుమార్తె, మామ కుమార్తె, సోదరి కుమార్తె మొదలైన వారిని వివాహం చేసుకుంటారు. కానీ ఓ చోట మాత్రం సొంత చెల్లెలిని పెళ్లాడతారు. అదెక్కడో చూద్దాం. భారతదేశంలో కుటుంబ సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. తల్లితండ్రుల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, అన్నాచెల్లెల అనురాగం, భార్యాభర్తల అనుబంధం ఇలా సంబంధాల జాబితా సాగుతుంది. కానీ ఓ గ్రామం అన్నాచెల్లెల బంధాన్ని భార్యాభర్తల బంధంగా మార్చేసింది.


Published on: 27 Feb 2024 15:28  IST

భారతదేశంలోని గిరిజన సమాజాలలో ఒకదానిలో పురుషులు తమ సోదరీమణులను వివాహం చేసుకుంటారు. ఒకే తల్లి కడుపున పుట్టిన స్త్రీ, పురుషుడు వివాహం చేసుకుంటారు. చాలా ఏళ్లుగా ఈ పద్ధతి పాటిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన జనాభా ఎక్కువ. “ధురువా” అనే గిరిజన సంఘం ఉంది. గిరిజన వర్గానికి చెందిన ఈ ప్రజలు సామాన్య ప్రజల కంటే కాస్త భిన్నమైన జీవన విధానాన్ని అనుసరిస్తారు.

ధురువా గిరిజన సంప్రదాయం ప్రకారం, ఒకే తల్లి గర్భం నుండి పుట్టిన అబ్బాయిలు , అమ్మాయిలు వివాహం చేసుకుంటారు. అంటే అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు అన్న సంబంధాలలో పెళ్లి చేసుకుంటారు. అటువంటి సంస్కృతిని ఇక్కడ ఎందుకు అనుసరిస్తున్నారో వివరణ లేదు. కానీ ఎవరైనా తమ సోదరులు , సోదరీమణులను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తే, వారు కఠినంగా శిక్షించబడతారు. ఈ గిరిజన సంఘం సంస్కృతిపై తీవ్ర అభ్యంతరాలున్నప్పటికీ తమ జాతిలో జనాభా పెరుగుదల కోసం ఇలాంటి పద్ధతినే అనుసరిస్తున్నట్లు చెప్పుకోవడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి